ETV Bharat / city

మహాదేవుని.. కల్యాణం.. వైభోగం - latest news on siva rathri

మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో మహాదేవునికి కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రైశైలం మల్లన్న ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వామి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయంలో లింగోద్భవం, శ్రీకాళహస్తిలో నందివాహనసేవ కన్నులపండువగా సాగాయి.

sivarathri at srisailam
శివరాత్రి వేడుకలు
author img

By

Published : Feb 22, 2020, 5:43 AM IST

శివరాత్రి పర్వదినాన... హరహర మహాదేవ, శంభోశంకర అంటూ భక్తజనం పులకించిపోయింది. ప్రధాన ఆలయాలన్నీ భక్తజన సంద్రమయ్యాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. ముందుగా స్వామి, అమ్మవార్లకు పురవీధుల్లో ప్రభోత్సవం, తర్వాత నందివాహనసేవ నిర్వహించారు. అనంతరం లింగోద్భవ మహాన్యాసరుద్రాభిషేకం చేశారు. ఆ తర్వాత పాగాలంకరణ జరిగింది. అర్థరాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య, శాస్త్రోక్తంగా క్రతువును పూర్తిచేశారు. కల్యాణాన్ని చూసేందుకు భారీగా భక్తులు పోటెత్తారు. కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

శ్రీకాళహస్తి భక్త జనసంద్రంగా మారింది. భక్తులు భారీగా తరలివచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుని తరించారు. నందివాహనసేవ వైభవంగా జరిగింది. ఓం నమ:శివాయ నామస్మరణతో ఆలయం మార్మోగింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై లింగోద్భవకాల అభిషేకాన్ని కన్నులపండువగా చేశారు. అనంతరం దుర్గామల్లేశ్వరుల దివ్యకల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించారు.

గుంటూరు జిల్లా కోటప్పకొండలో ప్రభల తీర్థం ఘనంగా సాగింది. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రభల వెలుగుజిలుగులతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయింది.

శివరాత్రి వేడుకలు

ఇదీ చదవండి : అడుగడుగునా శివతత్వం... అణువణువూ శివమయం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.