ETV Bharat / city

ఆవుల మృతి... సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ నిర్ణయం - cows dead incident

గోశాలలో ఆవుల మృతిపై డీజీపి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఫోరెన్సిక్, పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారంతో ఈ బృందం పనిచేయనుంది. రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు గోవుల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిష్పక్షపాతంగ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ... డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.

ఆవుల మృతి... సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ నిర్ణయం
author img

By

Published : Aug 13, 2019, 4:27 AM IST

కొత్తూరు తాడేపల్లి గోవుల మృతి కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డీజీపి ఆదేశాల మేరకు ఏసీపీ స్థాయి అధికారితో విజయవాడ సీపీ సిట్ ఏర్పాటు చేశారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాసరావు ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. సీసీఎస్ అధికారి చలపతిరావు, కొత్తపేట ఇన్స్​పెక్టర్ ఉమర్, శేఖర్​బాబు, అర్జున్, దీపిక అనే ముగ్గురు ఎస్సైలను సభ్యులుగా నియమించారు. పశుసంవర్ధక శాఖ, ఫోరెన్సిక్ అధికారులు సంయుక్తంగా ఈ కేసు దర్యాప్తు చేయనున్నారు.

గోవుల మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే శవపరీక్ష, ఫోరెన్సిక్ నివేదికలే ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. పశుగ్రాసంపై ఉన్న రసాయనాల అవశేషాలే ఆవుల మృతికి కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేలినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. విషప్రయోగమా... కాదా అనే విషయంపై ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమవుతుందని చెప్పారు. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ గోశాలను పరిశీలించారు. గోవుల మృతి కుట్ర పూరితంగానే జరిగిందని ఆరోపించారు. పోలీసులు దర్యాప్తులో నిష్పక్షపాతంగ వ్యవహరించాలని కోరారు.

గోశాలలో ప్రస్తుతం 25 సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. 1400 గోవులకు కనీసం 100 మంది సిబ్బంది కావాలని గోశాల కమిటీ సభ్యులు చెపుతున్నారు. సేవాథృక్పధంతో నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరుతున్నారు. విరాళాల రూపంలో వచ్చిన నగదుతో నిర్వహణ జరగుతుందన్నారు. గోవులకు వినియోగించే పశువుల దాణాను పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తామని... కొంతమంది ఉచితంగా అందిస్తున్నారని నిర్వాహకులు చెపుతున్నారు.

ఆవుల మృతి... సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ నిర్ణయం

ఇదీ చదవండీ...

రైతన్న కళ్లల్లో ఆనందం నిండాలి: చంద్రబాబు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.