![Ysr Telangana party news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12365542_fla.jpg)
ఈనెల 8న వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (Ysr Telangana Party)ని ప్రకటించి.. అనంతరం ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు వైఎస్ షర్మిల (Ys Sharmila) తెలిపారు. ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించిన జెండా సిద్ధమైనట్లు తెలుస్తోంది. జెండాకు సంబంధించిన పలు అంశాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
70 శాతం పాలపిట్ట రంగు, 30 శాతం నీలిరంగుతో పార్టీ జెండాను సిద్ధం చేసినట్లు షర్మిల అనుచర వర్గాలు వెల్లడించాయి. జెండా మధ్యలో తెలుపు రంగులో తెలంగాణ భౌగోళిక స్వరూపం కన్పించేలా ఏర్పాటు చేసి అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా రూపకల్పన చేసినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. త్వరలో అధికారికంగా వివరాలు వెల్లడించనున్నట్లు వైఎస్ షర్మిల అనుచరులు తెలిపారు.
ఇదీ చూడండి:
Rayalaseema Lift Irrigation Project: కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ