ETV Bharat / city

ఉపాధ్యాయ బదిలీలు సక్రమంగా జరగటం లేదని ఏడుగురు ఎమ్మెల్సీలు నిరహారదీక్ష

ఉపాధ్యాయ బదిలీలు సక్రమంగా జరగటం లేదని ఏడుగురు ఎమ్మెల్సీలు విజయవాజ ధర్నాచౌక్​ వద్ద నిరహారదీక్ష చేపట్టారు. బదిలీ ఒక హక్కుగా కాకుండా ప్రజాప్రతినిధులు వారికి కావాల్సిన వారిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా అధికారులు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. బదిలీలు మాన్యవల్ కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించాలని,పోస్టలు బ్లాకింగ్ తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు.

ఎమ్మెల్సీలు నిరహారదీక్ష
ఎమ్మెల్సీలు నిరహారదీక్ష
author img

By

Published : Dec 25, 2020, 5:58 AM IST

ఉపాధ్యాయ బదిలీల్లో ముఖ్యమంత్రి జోక్యాన్ని కోరుతూ ఏడుగురు ఎమ్మెల్సీలు విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద నిరాహారదీక్ష నిర్వహించారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ అంతుపట్టని స్థితి నెలకొందని... విద్యాశాఖ యంత్రాంగం ఉపాధ్యాయ లోకాన్ని ఒక శత్రువుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీ ఒక హక్కుగా కాకుండా ప్రజాప్రతినిధులు వారికి కావాల్సిన వారిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా అధికారులు ఫోన్లు చేసి మరీ ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడేందుకు విద్యాశాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ముందుకు రావడం లేదని... దీనివల్ల ఈ ఏడాది బదిలీలు అగమ్య గోచరంగా మారాయన్నారు. దీనికితోడు దాదాపు 20 వేల ఉపాధ్యాయ ఖాళీలు మొత్తం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని... ఈ దశలో సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీలతో ఒక సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరహారదీక్షలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్‌.లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ, తదితరులు పాల్గొన్నారు.

వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయ సమ్మె:

ప్రకాశం జిల్లా:

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధ్యాయుల సమ్మెలో ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పటికైనా మాన్యువల్ కౌన్సెలింగ్​లో ఎస్జీటీల బదిలీలు నిర్వహించాలని, బ్లాక్ చేసిన పోస్టులను తెరవాలని, చైల్డ్ ఇన్ఫో మాధ్యమం మార్పు వలన కోల్పోయిన పోస్టులను పురుద్ధరించాలని ఉపాధ్యాయులు కోరారు.

teacher strike
ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల సమ్మె

అనంతపురం జిల్లా:

జిల్లాలోని మడకశిర పట్టణంలోని మండల వనరుల కేంద్రం (ఎం.ఆర్.సి) వద్ద ఉపాధ్యాయ సంఘాలు బైఠాయించి బదిలీలను న్యాయబద్ధంగా చేపట్టాలని నిరసన వ్యక్తం చేశారు. మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టిందన్నారు. ప్రభుత్వం పోస్టులను బ్లాక్ చేస్తూ, వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. ఈ విధానాన్ని నిలిపి వేసి చట్టపరంగా మాన్యువల్ పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు..

ఇదీ చదవండి :

ఇళ్లపట్టాల పంపిణీపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.