ETV Bharat / city

Murder: బెజవాడ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్ - విజయవాడ దుర్గ అగ్రహారంలో రామారావు హత్య

ఓ ప్రేమ జంట వ్యవహారంలో చేసిన సెటిల్ మెంట్ ఓ హత్య(Murder)కు దారితీసింది. సెటిల్ మెంట్​లో పాల్గొన్న ప్రత్యర్థిని అతి కిరాతంగా కత్తులతో వేటాడారు. విజయవాడ నగరంలో పట్టపగలే జరిగిన ఈ హత్య కేసు సంచలనం రేపింది. గత నెల 25న జరిగిన ఆలుమూరు రామారావు హత్య కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై గతంలో పలు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.

Durga Agraharam Murder case
దుర్గ అగ్రహారం హత్య కేసు
author img

By

Published : Jul 2, 2021, 1:38 PM IST

Updated : Jul 2, 2021, 3:39 PM IST

ప్రేమ జంట పంచాయితీ దారుణ హత్యకు దారితీసింది. బెజవాడలో మరోసారి కక్షలు వికృతరూపం దాల్చాయి. గత నెల 25న పట్టపగలే జరిగిన సంచలన హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారులోని కండ్రికకు చెందిన పవన్ అనే యువకుడు ఓ మైనర్​ను ప్రేమించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులనాశ్రయించగా.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

జూన్ 16న పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. పవన్ తరపున ఆలుమూరు రామారావు, బాలిక బంధువు మురళీ, కొలకలూరి రవి పంచాయితీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఇరువురి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. పోలీసులు రావటంతో వెళ్లిపోయారు. అనంతరం మృతుడు రామారావు కొలకలూరి రవి అలియాస్ కుక్కల రవికి రెండు సార్లు ఫోన్ చేసి ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాడు. దీంతో రామారావు తనను హత్య చేస్తాడనే ఉద్దేశ్యంతో కుక్కల రవి రామారావును చంపాలని నిర్ణయించుకున్నాడు.

పథకం ప్రకారమే హత్య

కుక్కల రవి తన స్నేహితులైన అశోక్ కుమార్, కరీమ్, నిహాంత్, దుర్గా శివప్రసాద్ అలియాస్ కోతల శివ, మురళీ, వినయ్​లతో కలిసి రామారావు హత్యకు పథకం వేశాడు. ముందుగా రెక్కీ నిర్వహించారు. కండ్రికలో రామారావుకు బలగం ఎక్కువగా ఉండటంతో విజయవాడలో హత్య చేయాలని నిర్ణయించాడు. హత్య చేసి సులువుగా తప్పించుకునే ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. గత 25న కరీమ్ రామారావుకు ఫోన్ చేసి దుర్గ అగ్రహారంకు పిలిపించారు. కుక్కల రవి , నిహాంత్, అశోక్, కరీంలు అక్కడకు ముందుగానే చేరుకుని మద్యం సేవించారు. రామారావు రాగానే అతనిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలం పరిసరాల్లో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులపై పలు కేసులున్నట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ చెబుతున్నారు. ఇందులో కోతల శివ, కుక్కల రవిలపై రౌడీ షీట్లున్నాయని తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న మిగతా నిందితులపై కూడా రౌడీషీట్ తెరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసుల వైఫల్యమే కారణమా..!

ఈ హత్యకు ఇరువురి మధ్య జరిగిన వివాదమే కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యం వల్లే హత్య జరిగిందని నగరవాసులు భావిస్తున్నారు. జూన్ 16 పంచాయితీ జరిగిన అనంతరం వచ్చిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఘర్షణ విషయం బయటపడేది. రామారావు, కుక్కల రవిని స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తే వివాదం సద్దుమణిగి ఉండేదని భావిస్తున్నారు. రౌడీషీటర్లు, పాతనేరస్తులు ఓ హత్యకు పథకం వేస్తున్నా సమాచారం తెలుసుకోకపోవటం స్థానిక పోలీసుల వైఫల్యం ఉందనే చెపుతున్నాయి. నగరంలో పటమట పీఎస్ పరిధిలో గ్యాంగ్ వార్, తాజాగా సీతానగరం ఘటన జరిగన తర్వాత పోలీసులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్​లు, రౌడీషీటర్లపై నిఘా పెట్టామని ..కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. అయినా ఇటువంటి సంచలన ఘటనలు జరగటం బెజవాడ నేరాలకు అడ్డాగా మారుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సంబంధిత కథనం:

MURDER: విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణం.. నడిరోడ్డుపై వ్యక్తి హత్య

Last Updated : Jul 2, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.