ETV Bharat / city

వైరస్ సోకింది.. వెళ్లి పోయింది.. కానీ ఈ విషయం వారికి తెలీదు! - ఇమ్యూనిటీతో కరోనా వైరస్​ రాదు న్యూస్

కృష్ణా జిల్లాలో సుమారు 20 శాతం మందికి కరోనా సోకింది.. వెళ్లింది.. కానీ ఈ విషయం వారికి తెలియదు. రక్త నమూనాల పరీక్షల ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొవిడ్ వ్యాప్తి, ఇన్​ ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు వైద్యారోగ్య శాఖ కృష్ణా, తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 'సిరో సర్వైలెన్స్'​ను ఇటీవల నిర్వహించింది.

eenadu2
eenadu2
author img

By

Published : Aug 18, 2020, 5:35 AM IST

Updated : Aug 18, 2020, 6:33 AM IST

రాష్ట్రంలో 4 జిల్లాల్లో జరిగిన సిరో సర్వైలెన్స్ ఫలితాలపై విశ్లేషణ జరుగుతోంది. నాలుగు జిల్లాల్లో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. పట్టణాలు/ నగరాల్లో 30 % , గ్రామీణ ప్రాంతాల్లో 70 % చొప్పున ఈ నమూనాలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన కేసులు, వయసు, పురుషులు, మహిళల కేటగిరి, ఇతర ప్రమాణాల ప్రకారం ఇప్పటివరకు వైరస్ సోకని వారి నుంచి మాత్రమే ఈ సేకరణ జరిగింది. వీరి రక్త నమూనాలను క్లియా మిషన్ల ద్వారా పరీక్షించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20 % మంది వైరస్ సోకి .... వెళ్లిపోయినట్లు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో 15 %, నెల్లూరు జిల్లాలో 9 % , అనంతపురం జిల్లాలో 12 % నుంచి 14 % మందికి వైరస్ సోకింది. వీరెవరికీ వైరస్ వచ్చి వెళ్లినట్లు తెలియదు. ఈ ఫలితాలను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తున్నారు .

  • కేసుల నమోదుకు తగ్గట్టుగానే..!

కృష్ణా జిల్లాలో నమోదవుతోన్న కేసులకు తగ్గట్లుగానే 'సిరో సర్వైలెన్స్' ఫలితాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు . నమూనాల సేకరణ జరిగిన ప్రాంతాల వారీగా పరిశీలిస్తే .. ఒక్కొక్కచోట 20 % కంటే ఎక్కువ మందికి వైరస్ సోకి , వెళ్లినట్లు గుర్తించారు. వీరితోపాటు వైరస్ నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్ గా తేలిన వారిని మినహాయిస్తే.. మిగిలిన వారిలోనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించాలి. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో వైరస్ సంక్రమణ తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఫలితాల విశ్లేషణ పూర్తయిన అనంతరం మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది.

వైరస్ సోకింది.. వెళ్లి పోయింది.. కానీ ఈ విషయం వారికి తెలీదు!

ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 లక్షలకు చేరువలో.. కొత్తగా 6,780 మందికి కరోనా

Last Updated : Aug 18, 2020, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.