ETV Bharat / city

Dwakra Groups: డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి.. ఆన్​లైన్ ద్వారా విక్రయాలు - డ్వాక్రా ద్వారా మహిళలకు ఉపాధి వార్తలు

మహిళల అభ్యున్నతికి, కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవటానికి స్వయం సహాయక సంఘాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. స్వయం ఉపాధి పొందేందుకు డ్వాక్రా సంఘాలు(Dwakra Groups) వరంగా మారాయి. కృష్ణా జిల్లాతోపాటు..రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో.. స్వయం సహాయ సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను.. డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ.. ఉపాధి పొందటమే కాక లాభాలు ఆర్జిస్తున్నారు.

Self-employment for women through Dwakra  groups
డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి
author img

By

Published : Sep 22, 2021, 1:45 PM IST

డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి

ఉద్యోగాలు చేసేందుకు తగినంత విద్యార్హత లేక.. స్థానికంగా పని దొరక్క ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలకు డ్వాక్రా సంఘాలు మంచి అవకాశంగా మారాయి. పది మంది కలసి ఒక బృందంగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలు.. స్వయం ఉపాధిలో అగ్రగామిగా రాణిస్తున్నాయి.

ఉపాధి కోసం..

ఉపాధి కోసం డ్వాక్రా సంఘాల సభ్యులు అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వీటిని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డ్వాక్రా స్టాళ్లలో మహిళలే విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు చేస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు.

డ్వాక్రా బజార్లలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో అమ్మకాలు

డ్వాక్రా గ్రూపుల్లో స్వయం ఉపాధి పొందుతున్న సభ్యులు.. ఒక్కొక్కరు ఒక్కోరకం వస్తువులు తయారు చేస్తున్నారు. హెర్బల్ ఉత్పత్తులు, దుస్తులు, కాటన్ వస్తువులు, పచ్చళ్లు.. ఇలా రకరకాల ఉత్పత్తులు తయారు చేసి, డ్వాక్రా బజార్లలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో.. అమ్ముతున్నారు. ఆయా గ్రూపులకు చెందిన సభ్యుల్లో ఒకరు స్టాళ్లల్లో విక్రయాలు జరుపుతుంటారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి తమ సంపాదన కూడా తోడై.. ఆర్థికంగా నిలదొక్కుకున్నామని.. డ్వాక్రా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్​లైన్ ద్వారా విక్రయాలు
డ్వాక్రా, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి.. వారిని మరింత ప్రోత్సహించేందుకు ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. కరోనా కాలంలోనూ తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించి.. ఆర్థిక ఇబ్బందులు అధిగమించామని డ్వాక్రా సంఘాల సభ్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: అవసరం లేకున్నా సిజేరియన్లు... ప్రభుత్వాసుపత్రుల్లో 34%, ప్రైవేటులో 66% కోతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.