గ్రామ, వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులకు..డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ అధికారులుగా వీఆర్వోలను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోనెంబర్ 2 పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థను.. తమపై రుద్దుతున్నారని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ఆక్షేపించారు. పలు ఉద్యోగ సంఘాల రాష్ట్ర కమిటీలు సమావేశమై...ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రజలకు సత్వర సేవలందించే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఇప్పుడు దాన్ని వీఆర్వోలకు అప్పగించడం అప్రజాస్వామికమని..పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే...జీవో నంబర్ 2ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వీఆర్వోలు స్వాగతిస్తున్నారు. ఇది తమకు అదనపు బాధ్యత మాత్రమే అంటున్నారు. కేవలం కొత్తగా నియమితులైన సచివాలయ ఉద్యోగులను సమన్వయం చేయడంతో పాటువారికి సంబంధించి డీడీవోగా మాత్రమే వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించారన్నారు.
వీఆర్వోలకు అధికార బదలాయింపు నిర్ణయంపై..అనంతపురం జిల్లా రొద్దం, కదిరిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో..వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల మధ్య వాగ్వాదం జరగ్గా,.. ఇరువర్గాలకు ఎంపీడీవో సర్దిచెప్పి పంపారు.
ఇదీచదవండి