ETV Bharat / city

పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: ఎస్​ఈసీ

పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన..విధుల్లో పాల్గొన్న అధికారులకు అభినందనలు తెలిపారు.

sec on muncipal elections
sec on muncipal elections
author img

By

Published : Mar 10, 2021, 9:04 PM IST

పురపాలికల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. అక్కడక్కడ చిన్నపాటి ఘటనలు మినహా...ఎక్కడా తీవ్రమైన ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. పంచాయతీ, పురపాలిక ఎన్నికల్లో ఎక్కడా రీపోలింగ్ లేకుండా ముగియడం ఇదే తొలిసారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు విజయవంతం కావడానికి అధికారుల సమష్టి కృషి కారణమన్న ఆయన..జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు సమర్థంగా పని చేశారన్నారు. వారందరికీ నిమ్మగడ్డ అభినందనలు తెలిపారు.

పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై జిల్లాల‌ వారీగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులను కోరామన్నారు. వార్డు వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొన్న ఘటనలు ఉంటే వాటిని నమోదు చేసి హైకోర్టు తీర్పు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేషన్లలో 57.14 శాతం, మున్సిపాలిటీల్లో 70.66 శాతం పోలింగ్ జరగటం సంతృప్తి కల్గించిందన్నారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు.. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

ఇదీచదవండి

మున్సిపల్​ ఎన్నికల్లో 62.28 శాతం పోలింగ్ నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.