విజయవాడ బృందావన్ కాలనీలో ఓ వజ్రాభరణాల సంస్థ నిర్వహించిన... సంక్రాంతి వేడుకలు సంప్రదాయాన్ని ప్రతిబింబించాయి. కాలనీ రోడ్డు సహా పరిసరాలను పూలతో.... అలంకరించారు.హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులతోపాటు కొండపల్లి బొమ్మల కొలువు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వినియోగదారులు పండుగ వాతావరణాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు.
ఆకర్షణగా నిలిచింది. వినియోగదారులు పండుగ వాతావరణాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు.సంక్రాంతివేడుకల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై పిల్లలకు భోగిపండ్లు పోశారు. రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద భోగి పళ్లు పోసి చిన్నారులను ఆశీర్వదించారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.
ప్రకాశం జిల్లా చీరాలలో సత్యసాయి సేవాసమితి అధ్వర్యంలో చిన్నారులకు సామూహికంగా భోగిపండ్లు పొశారు. చిన్నారులు నృత్యాలు చేసి అలరించారు. సంక్రాంతి సందర్భంగా.. ప్రకాశంజిల్లా అన్నంబొట్లవారిపాలెంలో.. గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ 33వ రాష్ట్రస్థాయి ఒంగొలు జాతి ఎడ్ల బలప్రదర్శన.. ఉర్రూతలూగించింది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం సంగమేశ్వర కొండ వద్ద సైకత శిల్పి హరికృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
ఇవీ చదవండి