ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలు ఉద్ధృతం.. రేపట్నుంచి సమ్మెకు నిర్ణయం! - రేపట్నుంచి ఏపీలో సమ్మె

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ... రేపటి నుంచి సమ్మె చేపట్టడానికి పారిశుద్ధ్య కార్మికులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో చెత్త ఎత్తకూడదని.. నిర్ణయించారు. సమస్యల పరిష్కారంపై.... ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించే ప్రసక్తి లేదని మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు.

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలు ఉద్ధృతం
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలు ఉద్ధృతం
author img

By

Published : Jul 10, 2022, 6:46 PM IST

పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్ తమను దారుణంగా మోసం చేశారని ఆరోపిస్తూ.. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులు తమ ఆందోళనను ఉద్దృతం చేస్తున్నారు. కనీస పనికి కనీస వేతనంతో పాటు వేతనాలు పెంచుతామన్న సీఎం జగన్ హామీ సహా పలు సమస్యలు పరిష్కరించకుండా విస్మరించటంపై మండిపడుతున్నారు.

ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపట్నుంచి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన కార్మికులు సమ్మెకు దిగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సమస్యలపై ఎలాంటి హామీ ఇవ్వకపోవటంతో సమ్మె మాత్రమే పరిష్కారమనే భావనకు వచ్చారు. రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో చెత్త ఎత్తకూడదని నిర్ణయించారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించే ప్రసక్తి లేదని మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.