కన్నబిడ్డలాంటి సహకార డెయిరీలను దెబ్బతీసి పొరుగు సంస్థ అమూల్‌కు లబ్ధి చేకూర్చే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రూ.4 కోట్ల నుంచి రూ.913 కోట్ల టర్నోవర్‌కు ఎదిగిన సంగం డెయిరీకి నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ‌్యక్తం చేశారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చినట్లు తెలిపారు. సంగం డెయిరీకి వచ్చే లాభాల్లో పాడి రైతులకు, ఉద్యోగులకు వాటాలు ఇస్తున్నట్లు చెప్పారు.
దేశంలోని అన్ని ప్రభుత్వాలు, సహకార డెయిరీలను ప్రోత్సహిస్తుంటే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ డెయిరీ కోసం ప్రభుత్వం అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టడాన్ని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత... ఒకరు మృతి