సంగం డెయిరీ కేసులో హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వ అప్పీల్‌తోపాటు గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ సంఘం వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. మీరు షేర్‌హోల్డర్ కాదు, సంగం మిల్క్ కంపెనీ హోదా పొందిన తర్వాత ఆ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చా అని ఏజీని ప్రశ్నించింది. దీనికి బదులిచ్చిన ఏజీ.. కంపెనీ హోదాకు ఆటకం కలిగే విధంగా వ్యవహరించడం లేదని, ప్రజా ఆస్తుల ప్రయోజనాల్ని కాపాడటం కోసం జీవో ఇచ్చామన్నారు . సంగం తరపున న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ... డెయిరీ నిర్వహణ బాధ్యతను పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ 1978 ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతం ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం 2021 లో జీవో ఇచ్చిందన్నారు . ప్రభుత్వ ఆస్తులు సహకార సంఘంలో లేవన్నారు . కంపెనీ హోదా పొందాక రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు . ఆస్తులేమైనా ప్రభుత్వానివి ఉంటే రాబట్టుకోవడానికి వేరే మార్గాన్ని అనుసరించాలి తప్ప .. కంపెనీని స్వాధీనంలోకి తీసుకుంటూ జీవో ఇవ్వడం తగదన్నారు . ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి