ETV Bharat / city

కోరిన చోటుకే ఇసుక... త్వరలో అందుబాటులోకి!

అధిక పరిమాణంలో ఇసుక కావాల్సిన నిర్మాణ సంస్థలు, గుత్తేదార్లు... కోరిన చోటుకే ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను సరఫరా చేయనుంది. టోకున ఇసుక తీసుకొని దానిని ఇతరులకు అధిక ధరలకు విక్రయించడం, లారీల యజమానులు ఎక్కువ రవాణా ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. వాటిని నియంత్రించేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. వచ్చే వారమే దీనిని ఆరంభించనున్నారు.

కోరిన చోటుకే ఇసుక
కోరిన చోటుకే ఇసుక
author img

By

Published : Feb 23, 2020, 8:49 AM IST

గుత్తేదారులు, నిర్మాణ సంస్థలకు అవసరమైన టోకు (బల్క్‌ / అధిక పరిమాణం) ఇసుకను వారు కోరిన చోటుకే సరఫరా చేసేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నద్ధమైంది. టోకున ఇసుక తీసుకొని దానిని ఇతరులకు అధిక ధరలకు విక్రయించడం, లారీల యజమానులు ఎక్కువ రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్న కారణంగా.. వాటిని నియంత్రించేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. వచ్చే వారమే తాజా నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.

బల్క్‌ ఆర్డర్‌లో తొలుత 50 టన్నులు పంపించి, అది అందినట్లు గుత్తేదారు సంస్థ సమాచారం ఇస్తేనే, మిగిలిన ఇసుకను పంపిస్తారు. ఇంటికే ఇసుక సరఫరా విధానం గత నెల 2న తొలుత కృష్ణా జిల్లాలో ఆరంభించగా, ఇపుడు కర్నూలు, చిత్తూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో క్రమంగా అమల్లోకి తెచ్చారు. సకాలంలో రవాణా ఛార్జీలు చెల్లించడం లేదనే కారణంతో కొన్ని జిల్లాల్లో లారీల యజమానులు వెనకడుగు వేశారు. తాజాగా 24-48 గంటల్లోనే చెల్లింపులు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

పగటిపూట సరఫరాకు వినతి

రేవు(రీచ్‌)ల్లో పగటిపూట ఇసుక తవ్వకాలు జరుపుతుండగా, రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల మధ్య ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. పగలు ట్రాఫిక్‌ తక్కువగా ఉండే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇంటికి రవాణా చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఏపీఎండీసీ అధికారులు.. డీజీపీకి లేఖ రాశారు. విశాఖకు రాజమహేంద్రవరం నుంచి ఇసుక తీసుకెళ్లి సరఫరా చేస్తున్నారు. ఇలా తీసుకెళ్లినందుకు రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ ఇసుక ధర అత్యధికంగా ఉంటోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా ఇసుక రవాణాకు మళ్లీ టెండర్లు పిలవడం, ఉభయ గోదావరి జిల్లాల వైపు నుంచి విశాఖకు ఖాళీగా వెళ్లే లారీల్లో ఇసుక తీసుకెళ్లే అవకాశం కల్పించడంపై ఆలోచన చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'3000టన్నులు కాదు 160కిలోల బంగారమే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.