ఈ దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి కారణం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే అని కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేడ్కర్ అని కీర్తించారు. రాజ్యాంగానికి ప్రతిరూపం బాబా సాహెబ్ అని, అణగారిన వర్గాలకు ఆశాదీపమని గుర్తు చేశారు. భవిష్యత్ తరాల కోసం, బడుగు జీవుల రక్షణ కోసం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిపేలా వ్యవస్థలు, ప్రభుత్వాలు పని చేయాలని కోరారు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఏపీసీసీ ఎస్సీ డిపార్ట్ మెంట్ కొరివి వినయ్ కుమార్, లీగల్ సెల్ చైర్మన్ వళిబొయిన గురునాథం, ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఇంచార్జి రాజీవ్ రతన్, కార్యదర్శి అడ్మినిస్ట్రేషన్ ఇంఛార్జి రవికాంత్ నూతలపాటి, డిజిటల్ మెంబర్షిప్ డెస్క్ ఇంఛార్జి మేడా సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ భవన్లో అంబేడ్కర్ జయంతి.. "దళితుల ప్రతిఘటన" పుస్తక ఆవిష్కరణ..!!