వెనుకబడిన వర్గాల ఉనికిని కాపాడేందుకే సీఎం జగన్ 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాలలోని ప్రతి ఒక్కరూ.. సంపన్న వర్గాలతో పోటిగా విద్యనభ్యసించాలనేది సీఎం ఆశయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొంది.. బీసీలంతా అభివృద్ధి చెందాలనేది ఆయన లక్ష్యమన్నారు.
గుంటూరు తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో.. రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ సమావేశానికి సజ్జల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ , ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: