ETV Bharat / city

SAJJALA: మా గురించి తెలంగాణ మంత్రులకు ఎందుకు ? తెదేపా నేతల్లాగే వారి మాటలు: సజ్జల - జగన్​పై వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్

ఏపీలో తెదేపా నేతల్లాగే.. తెరాస నేతలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) దుయ్యబట్టారు. బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Ts minister prashanth reddy) వ్యాఖ్యానించటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్​పై తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు (TS ministers comments on jagan) వారి విచక్షణకే వదిలేస్తున్నామన్నారు.

ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు ?

author img

By

Published : Nov 12, 2021, 6:25 PM IST

Updated : Nov 12, 2021, 8:12 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు (TS ministers comments on jagan) వారి విచక్షణకే వదిలేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) అన్నారు. బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Ts minister prashanth reddy) వ్యాఖ్యానించటం సరికాదన్నారు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆరే (KCR) అన్నారని.., ఆయన మాటలు తెలంగాణ మంత్రులు వినలేదేమోనని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్ధతి అవలంబిస్తుందని.. హక్కు ఉందని రోజూ చొక్కాపట్టి నిలదీయలేం కదా అని అన్నారు. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు ? అన్న సజ్జల..కేసీఆర్ మెప్పు కోసం కొందరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో తెదేపా నేతల్లాగే..తెరాస నేతలు మాట్లాడుతున్నారన్నారు.

"తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు వారి విచక్షణకే వదిలేస్తున్నాం. బిచ్చమెత్తుకుంటున్నామని అనడం సరికాదు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆరే అన్నారు. కేసీఆర్ మాటలు ఆయన మంత్రులు వినలేదేమో !.హక్కు ఉందని రోజూ చొక్కాపట్టి నిలదీయలేం. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పద్ధతి. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు ?. కేసీఆర్ మెప్పు కోసం కొందరు మంత్రుల ప్రయత్నం" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

3 రాజధానులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం

ఈనెల 14న తిరుపతిలో జరగనున్న సదరన్ జోన్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారని సజ్జల స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం పెండింగ్‌ అంశాలపై సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. 3 రాజధానులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. రైతులకు మరో 25 ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జగన్​పై తెలంగాణ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ ప్రజలు, సీఎం జగన్​పై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమొత్తుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వస్తే ప్రజలు అడుక్కు తింటారని అప్పట్లో ఏపీ నాయకులు అన్నారని గుర్తు చేశారు. కానీ ఏపీలోనే సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారని నిజామాబాద్​ జిల్లాలో తెరాస నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (ts minister Prasanth reddy) ఈ వ్యాఖ్యలు చేశారు.

"కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు పోవట్లేదు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు. రోజు ఖర్చుల కోసం కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు అప్పులు లేకపోతే ఆంధ్రా నడవదు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారు. దేశం మొత్తం బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం మాత్రం భాజపా వాళ్ల కింద మీటర్లు పెట్టాలి" -ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ మంత్రి

స్పందించిన మంత్రి పేర్ని నాని..

నిధుల కోసం కేంద్రం వద్ద జగన్​ బిచ్చం ఎత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం(minister perni nani fire on telangana leaders statements) చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో(andhra pradesh) అందరూ కలిసి హైదరాబాద్(hyderabad)​ను అభివృద్ధి చేశారని, పాడికుండ లాంటి హైదరాబాద్ ఉన్నా..తెలంగాణ అప్పుల పాలైందని మంత్రి విమర్శించారు. తెలంగాణ నేతల వైఖరి అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లుగా..ఉందని ఆక్షేపించారు.

కేసీఆర్(telangana CM KCR) తరచూ కేంద్రం వద్దకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నిధులిస్తే కేంద్రంలో చేరే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని మంత్రి అన్నారు. బయట కాలర్ ఎగరేసి...లోపలికెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్​కు రాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

పాడికుండ లాంటి హైదరాబాద్‌ ఉన్నా తెలంగాణ అప్పుల పాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. కేంద్ర నిధుల కోసం బిచ్చం ఎత్తుకుంటున్నామని అంటున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు తెలంగాణ నేతల వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. - పేర్ని నాని, రవాణశాఖ మంత్రి

సంబంధిత కథనాలు

Minister prashant reddy: సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు.. తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

MINISTER PERNI NANI: బయట కాలరెగరేసి.. లోపల కాళ్లు పట్టుకోవడం తెలియదు: పేర్ని నాని

Last Updated : Nov 12, 2021, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.