ETV Bharat / city

ఏపీసీసీ అధ్యక్షుడిగా సాకే శైలజనాథ్ ప్రమాణం

ఏపీపీసీ నూతన అధ్యక్షుడిగా మాజీమంత్రి శైలజానాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ చాందీ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

sailajanath-takes-oath-as-apcc-new-president

author img

By

Published : Jan 29, 2020, 5:53 PM IST

Updated : Jan 29, 2020, 8:16 PM IST

ఏపీసీసీ అధ్యక్షుడిగా సాకే శైలజనాథ్ ప్రమాణం

ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా సాకే శైలజనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా షేక్ మస్తాన్ వలి, ఎన్.తులసిరెడ్డి ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఉమెన్​చాందీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు గుండురావ్, రాజ్యసభ సభ్యుడు కేవీపీ, కేంద్ర మాజీమంత్రి మునియప్ప, మధుయాష్కీ గౌడ్, భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు.

జేఏసీ నాయకులు, రైతుల వినతి

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు​ గన్నవరం విమానాశ్రయంలో ఉమెన్​చాందీని అమరావతి ఐకాస నాయకులు, రైతులు కలిశారు. మూడు రాజధానులు వద్దు అంటూ ఉమెన్ చాందీకి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:అబార్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం- 24 వారాలకు గడువు పెంపు

Last Updated : Jan 29, 2020, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.