ETV Bharat / city

ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలి : ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు

కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ డిపోను ఏపీఎస్ఆ​ర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు సందర్శించారు. డిపో ఆవరణలో నిర్మించే వ్యాపార సముదాయ స్థలాన్ని పరిశీలించారు. డిపో అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. బస్సులు, ఉద్యోగుల పనితీరు వంటి వివరాలను సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. డిపో ఆవరణలో పచ్చదనంపై ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు హర్షం వ్యక్తం చేశారు.

RTC MD MT Krishnababu visited Gannavaram RTC Depot
గన్నవరం ఆర్టీసీ డిపో సందర్శించిన ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు
author img

By

Published : Dec 5, 2020, 1:20 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ డిపోను ఏపీఎస్​ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలో బస్సులు, ఉద్యోగుల వివరాల రికార్డులను కృష్ణబాబు పరిశీలించారు. అనంతరం డిపో ఆవరణలో నిర్మించే వ్యాపార సముదాయ స్థలాన్ని సందర్శించిన ఆర్టీసీ ఎండీ.. అభివృద్ధి పనులపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.

కింది నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేసి సంస్థకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎండీ సూచించారు. డిపో ఆవరణలో పచ్చదనంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారి నాగేంద్ర, డీఎమ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్ వ్యాక్సిన్.. రాష్ట్రానికి కోటి డోసులు కేటాయించే అవకాశం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.