ETV Bharat / city

APSRTC:రిటైల్ బంకుల నుంచే ఇంధనం కొనాలని నిర్ణయించాం: ఆర్టీసీ ఎండీ

author img

By

Published : Feb 22, 2022, 5:10 PM IST

Updated : Feb 22, 2022, 10:42 PM IST

బల్క్​గా డీజిల్ కొనుగోలు చేసే సంస్థలకు డీజిల్ రేట్లు పెంచడంతో ఆర్టీసీ ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. బయట రిటైల్ పెట్రోల్ బంకుల వద్ద రిటైల్​గా డీజిల్​ను కొనుగోలు చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు బస్సు డిపోల పరిధిలోని బయటి డిపోల్లో డీజిల్ పోయించుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. డీజిల్ వ్యయం తగ్గించేందుకు సంస్థలో ఎలక్ర్టిక్ వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని నిర్ణయించింది. సంస్థలో పెండింగ్​లో ఉన్న కారుణ్య నియామకాలన్నింటినీ భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఉద్యోగులు సమ్మె నోటీసులో ఇచ్చిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు.

త్వరలో కారుణ్య నియామకాలు పూర్తి చేస్తాం
త్వరలో కారుణ్య నియామకాలు పూర్తి చేస్తాం

ఏపీఎస్​ఆర్టీసీలో 12 వేల బస్సులున్నాయి. ఏడాదికి 30 కోట్ల లీటర్ల డీజిల్​ను సంస్థ వినియోగిస్తుంది. పెద్దఎత్తున డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తున్నందున అన్ని డిపోల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసిన సంస్థ.. బల్క్​గా ఆయిల్​ను కొనుగోలు చేస్తోంది. ఇలా బల్క్​గా డీజిల్ కొనుగోలు చేయటం వల్ల రిటైల్​గా ఉండే ధర కంటే తక్కువకే లభ్యమయ్యేది. నవంబర్ నుంచి పరిస్థితి మారుతూ వస్తోంది. బల్క్ గా డీజిల్ కొనే సంస్థలకు ధరలను ఇంధన ఉత్పత్తి సంస్థలు పెంచుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి 15 నాటికి రిటైల్​గా లీటర్ డీజిల్ ధర రూ.96.02 రూపాయలు ఉండగా.., బల్క్ ఇంధనం ధర లీటర్​కు రూ.100.41 పెరిగింది. రిటైల్ కంటే లీటర్​కు రూ.4.39 ఎక్కువగా ఆర్టీసీ కొనాల్సి వస్తోంది. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ.32లక్షల అదనపు భారం పడి నష్టపోతోంది.

రిటైల్ బంకుల నుంచే ఇంధనం కొనాలని నిర్ణయించాం

రిటైల్ బంకుల నుంచి ఇంధనం కోనుగోళ్లు..

ఇప్పట్లో బల్క్ రేట్లు తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఆర్టీసీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. బల్క్​గా డీజిల్ కొనుగోలు నిలిపివేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని డిపోల్లోనూ సమీపంలోని ప్రైవేట్ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. ఏలూరు, రాజోలు, రంగంపేట, ఉరవకొండలో ఆర్టీసీకి రిటైల్ పెట్రోల్ బంకులున్నాయి. సమీపంలోని డిపోలు అక్కడి నుంచి డీజిల్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 2013లోనూ ఇలాంటి సమస్యే ఎదురుకావడంతో అప్పట్లో ఇలాగే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే సమస్య పునరావృతం కావటం.., పైగా తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లోనూ రిటైల్ బంకుల నుంచి అక్కడి ఆర్టీసీలు రిటైల్​గా డీజిల్​ను కొనుగోలు చేస్తున్నాయి. ఇక్కడ కూడా రిటైల్​గానే డీజిల్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బల్క్ రేట్లు తగ్గినపుడు తిరిగి ఆయిల్ తయారీ సంస్థల నుంచి కొనాలని నిర్ణయించారు.

ఎలక్ట్రిక్ బస్సులు..

డీజిల్ ధరలు పెరుగుదల వల్ల సంస్థకు ఆర్థికంగా నష్టాలు పెరుగుతున్నందున ఎలక్ట్రిక్ బస్సులు సంఖ్య పెంచాలని నిర్ణయించారు. తిరుమల సహా మిగిలిన ప్రాంతాల్లో కొద్ది రోజుల్లో 100 ఎలక్ట్రిటిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా 100 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. ఇలా మార్చడం వల్ల బస్సుకు 60 లక్షలు ఖర్చవుతాయని, డీజిల్ వినియోగం తగ్గడం వల్ల సంస్థకు లాభదాయకంగా ఉంటుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.

త్వరలో కారుణ్యనియామకాలు..

ఆర్టీసీలో పెండింగ్​లో ఉన్న కారుణ్య నియామకాలన్నీ సత్వరమే భర్తీ చేయాలని నిర్ణయించారు. 2015 నుంచి 2019 వరకు పెండింగ్​లో ఉన్న వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలివ్వనున్నట్లు ఎండీ తెలిపారు. 1500 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలివ్వనున్నట్లు తెలిపారు. విలేజ్ వార్డు సెక్రటేరియట్, ఆర్టీసీలోని ఖాళీల్లో భర్తీ చేస్తామని, రెండింటిలోనూ అర్హత లేని వారికి కలెక్టర్ ద్వారా ఇతర పోస్టుల్లో భర్తీ చేస్తామన్నారు. కారుణ్య నియామకాలపై ఎవరూ కంగారు పడవద్దని కోరారు. విలీనం తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విలీనానికి ముందు మెడికల్ అన్​ఫిట్ వారి పిల్లలకు మేనిటరీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తామన్నారు.

కార్మిక సమస్యలు పరిష్కరిస్తాం..

కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసులోని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ ప్రక్రియ కొనసాగుతుందని.., ఉద్యోగులు ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఒక్కొక్కటిగా సమస్యలు పరుష్కరిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బల్క్ ధరలు తగ్గాక ప్రభుత్వ వాహనాలకూ త్వరలో ఆర్టీసీ ద్వారా డీజిల్ సరఫరా చేయనున్నట్లు ఎండీ తెలిపారు. విలీనం అనంతరం సంస్థ నష్టాలు తగ్గుతున్నాయని, కొవిడ్ వ్యాప్తి తగ్గాక మూడు నెలలుగా సంస్థ పరిస్థితి మెరుగు పడుతోందన్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని కొంత ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ఎంత మేర ప్రభుత్వానికి ఇవ్వాలనేది చర్చించి నిర్ణయిస్తామన్నారు.

ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డు..

ఏపీఎస్‌ ఆర్టీసీ మరో జాతీయ స్థాయి అవార్డు సాధించింది. డిజిటల్‌ విధానాలను సమర్థంగా అమలు చేస్తోన్నందుకు ఇచ్చే 'డిజిటల్‌ టెక్నాలజీ సభ' అవార్డుకు ఆర్టీసీ వరుసగా నాలుగో సారి ఎంపికైంది. జాతీయ స్థాయిలో పలు ప్రభుత్వ సంస్థలతో పోటీపడి ఈ అవార్డు సాధించింది. యాప్‌ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టికెట్లు జారీ చేస్తోంది. వీటిలో విశేష ప్రగతి సాధించినందుకు డిజిటల్‌ టెక్నాలజీ సభ అవార్డుకు ఆర్టీసీ ఎంపికైంది. వర్చువల్‌ సెమినార్‌ ద్వారా అవార్డును ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అందుకున్నారు.

ఇదీ చదవండి

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు

Last Updated : Feb 22, 2022, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.