జూన్ 13నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యల పరిష్కారానికై యాజమాన్యం చొరవ చూపకపోవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ కన్వీనర్ దామోదర్ తెలిపారు. దానిలో భాగంగా సమ్మె సన్నాహక గోడ పత్రికను విజయవాడలో ఆవిష్కరించారు.
దూర ప్రాంత సర్వీసులు నిలుపుదల...
ఈ నెల 12 నుంచి దూరప్రాంత సర్వీసులు నిలుపుదల చేస్తున్నట్లు కన్వీనర్ వెల్లడించారు. కొత్త ప్రభుత్వం మా సమస్యలపై స్పందించాలని...ఆర్థిక పరమైన అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ హామీ ఇచ్చారని.. ఆ మేరకు చర్యలు తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని జేఏసీ కన్వీనర్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి-'నాకు డాడీ కావాలి... ప్లీజ్ లే డాడీ'