ETV Bharat / city

RTC Charges: ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం.. సీఎం వద్దకు త్వరలో ప్రతిపాదనలు - ఏపీఎస్​ఆర్టీసీ రేట్లు పెంచే అవకాశం

RTC Charges: రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెరగగా.. త్వరలో ఆర్టీసీ టికెట్‌ ఛార్జీల రూపంలో.. ప్రజలకు అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో.. ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గమని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు త్వరలో సీఎం ముందుకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

RTC Charges to be increased in andhra pradesh
ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం
author img

By

Published : Apr 1, 2022, 8:09 AM IST

RTC Charges: విద్యుత్‌ ఛార్జీల పెంపుతో నడ్డివిరిగిన రాష్ట్ర ప్రజలపై.. త్వరలో ఆర్టీసీ టికెట్‌ ఛార్జీల రూపంలో అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్‌ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గమని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. దీంతో ధరల పెంపుపై ప్రతిపాదనలను ఉన్నతాధికారులు త్వరలో సీఎం ముందుకు తీసుకెళ్లనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సీఎం పచ్చజెండా ఊపితే ఆర్టీసీ ఛార్జీల వడ్డన మొదలయ్యే వీలుందని సమాచారం.

ఆర్టీసీ ఏటా సగటున 29-30 కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తోంది. గతంలో లీటరు రూ.70కి చేరడంతో 2019లో ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్‌ డీజిల్‌ రూ.102కి చేరింది. కొద్ది రోజులుగా నిరంతరం ధర పెరుగుతూనే ఉంది. దీంతో డీజిల్‌ రూపంలోనే ఏటా రూ.900-1,000 కోట్ల మేర భారం భరించాల్సి వస్తోందని అధికారులు లెక్కలు వేశారు.

ఇదీ చదవండి:

ప్రజలకు పెట్రో మంట.. సర్కారుకు కాసుల పంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.