గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలో మళ్లీ రౌడీ గ్యాంగులు పేట్రేగి పోతున్నాయి. కరోనా వేళ అంతా అదుపులో ఉన్నట్లే కనిపిస్తున్నా గ్యాంగుల ఆగడాలు షురూ అయ్యాయి. గల్లీల్లో సెటిల్మెంట్లు చేస్తున్న వారి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్‌గా మారాయి. గతంలో కత్తులతో వీరంగం సృష్టించిన నిందితుడు మణికంఠ అలియాస్ కేటీఎం పండు జైలు నుంచి బెయిల్‌పై వచ్చీరాగానే తన పాత పందాను కొనసాగిస్తున్నాడు. దుర్గమ్మ చెంతన ప్రశాంతంగా ఉండాల్సిన నగరంలో ఒక్కసారిగా రౌడీల ఆగడాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. పటమట గ్యాంగ్ వార్(Gang war)లో తోట సందీప్ మృతి తరువాత నగరంలో ఉద్రిక్తతలు కొంత తగ్గినట్లు కనిపించినా.. పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని తాజా వీడియో ద్వారా తెలుస్తోంది.
విజయవాడలో అసలేం ఏం జరుగుతోంది..?
విజయవాడ గ్యాంగ్‌వార్(Gang war) నిందితుడు పండును పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గంజాయి అమ్మకాలు, మారణాయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో అతడిని అరెస్టు చేశారు. ఐదుగురు అనుచరుల్నీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మారణాయుధాలు, 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ వార్(Gang war) కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన పండు.. తీరు మార్చుకోకుండా మళ్లీ కత్తులు, కర్రలతో దాడులు చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకుని స్నేహితులకు పంపాడు. వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:
విజయవాడ గ్యాంగ్ వార్: వెలుగులోకి కీలక అంశాలు
విజయవాడలో గ్యాంగ్ వార్..ఏం జరిగిందంటే..!
రౌడీషీటర్ పండుకు నగరబహిష్కరణ తప్పదా..? సీపీ ఏమంటున్నారు..?