రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు.
కృష్ణా జిల్లాలో..
విజయవాడ నగర శివారు గుణదల బైపాస్ రోడ్డులో టిప్పర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నేపాల్‌కు చెందిన కాంన్షుగా పోలీసులు గుర్తించారు. అతను బైపాస్ రోడ్డులోని హోటల్లో కార్మికుడిగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం లారీ డ్రైవర్ అజాగ్రత్త వలనే జరిగినట్లు స్ధానికులు తెలిపారు. సంఘటనా స్ధలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చెస్తున్నట్లు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తయ్యయని పోలీసులు పేర్కొన్నారు.
కడప జిల్లాలో..
కమలాపురం మండలం పెద్దచెప్పలి వద్ద ట్రాక్టర్ ఢీకొని పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. టి.కొత్తపల్లికి చెందిన గురు విష్ణు (16) తన ఇంటి నుంచి సైకిల్‌పై స్కూల్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థి తల్లికి కళ్లు కనిపించకపోగా.. నాన్నకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో.. ఆ కుటుంబానికి ఆధారంగా నిలిచిన బాలుడి మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
నెల్లూరు జిల్లాలో..
చిల్లకూరు మండలం కడివెడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి రాఘవాపురంకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ.. కోట నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో.. ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరలించారు.