రాష్ట్రంలో శుక్రవారం నాటికి 500 గ్రామాల్లో డ్రోన్ సర్వే జరిగినట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ-సర్వేపై ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు 500 గ్రామాల్లో 50 గ్రామాల భూములకు మ్యాపింగ్ కూడా పూరైనట్లు పేర్కొన్నారు. వీటిల్లో రీ-సర్వేను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మిగిలిన గ్రామాల్లో మ్యాపింగ్ జరగాల్సి ఉందన్నారు. రీ-సర్వేకు అనుగుణంగా రాష్ట్రంలో 70శాతం భూముల వివరాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శి చక్రవర్తి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, సర్వే శాఖ కమిషనర్ సిదార్థజైన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీఆర్‌ఏ, వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతులపై కూడా చర్చించారు.
ఇదీ చూడండి: