ETV Bharat / city

Gulab Cyclone Effect: తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ - తెలంగాణలో గులాబ్ తుపాను ఎఫెక్ట్ తాజా వార్తలు

RED ALERT IN TELANGANA DUE TO GULAB CYCLONE EFFECT
తెలంగాణలో గులాబ్ తుపాను ఎఫెక్ట్.. 14జిల్లాల్లో రెడ్ అలర్డ్
author img

By

Published : Sep 27, 2021, 4:48 PM IST

Updated : Sep 27, 2021, 7:10 PM IST

16:45 September 27

రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

RED ALERT IN TELANGANA DUE TO GULAB CYCLONE EFFECT
తెలంగాణలో గులాబ్ తుపాను ఎఫెక్ట్

గులాబ్‌ తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై (Gulab Cyclone Effect on Telangana) పడుతోంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ (RED alert) ప్రకటించింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. 

అలాగే ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు (orange alert) జారీ చేసింది. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

గులాబ్​ పంజా

తెలంగాణపై గులాబ్ తుపాను(Cyclone Gulab Effect on Hyderabad) పంజా విసురుతోంది. దీని ప్రభావం(Cyclone Gulab Effect on Hyderabad)తో హైదరాబాద్​లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వాన నగర ప్రజలను భయపెడుతోంది. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు హైదరాబాద్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఇద్దరు అధికారులతో కలెక్టరేట్‌లో  హైదరాబాద్​ పరిధిలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి.. వరదలో చిక్కుకున్న వారు కంట్రోల్ రూం నంబర్ 040 23202813 కి కాల్ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి: 

AP RAINS: గులాబ్‌ తుపానుతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర

Last Updated : Sep 27, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.