ETV Bharat / city

ఏపీఎస్​ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం..ఏంతంటే ! - ఏపీఎస్​ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం

వివాహాలు, శుభకార్యాలు, వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావటంతో ఏపీఎస్ ఆర్టీసీకి రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీ కారణంగా నిన్న రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది.

ఏపీఎస్​ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
ఏపీఎస్​ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
author img

By

Published : Jun 14, 2022, 9:57 PM IST

ఏపీఎస్​ఆర్టీసీ నిన్న (ఆదివారం) రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. వివాహాలు, శుభకార్యాలు, వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావటంతో ఆర్టీసీకి అధిక ఆదాయం వచ్చింది. నిన్న ఒక్కరోజే రూ.18.33 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు నడిపినట్లు తెలిపారు. తిరుమల-తిరుపతి మధ్య అధికంగా బస్సు సర్వీసులు నడిపినట్లు వెల్లడించారు.

తిరుమలకు నిన్న ఒక్కరోజే 2,852 ట్రిప్పులు నడిపిన ఆర్టీసీ.. తిరుపతి జిల్లాలో 84 శాతం ఓఆర్ నమోదు చేసింది. తిరుపతి జిల్లాలోనే రూ.1.75 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. తెలంగాణ బస్సుల్లో ఛార్జీల పెంపు, ఏపీ బస్సుల్లో ఛార్జీలు పెంచనందున ఆదాయం పెరిగిందన్నారు. విజయవాడ-హైదరాబాద్ రూట్​లో ఏపీ బస్సుల్లో రద్దీ పెరిగిందని ఆర్టీసీ ఈడీ వెల్లడించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.