రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాృతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్... రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సమాజానికి సన్మార్గం, సత్యమార్గాన్ని ప్రబోధించే ఖురాన్‌లోని తొలి సూత్రాలను మహమ్మద్ ప్రవక్త వెల్లడించిన పవిత్ర మాసం రంజాన్ అని చంద్రబాబు అన్నారు.
ముస్లింలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికతల సారమే రంజాన్ పండుగ అని పవన్‌కల్యాణ్ అన్నారు. రంజాన్ పండుగ ఈ ఏడాది పొడగునా ఇంటిల్లిపాదికీ ఆనందాలు పంచాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. మంగళగిరి నియోజకవర్గంలోని 180 మంది ఇమామ్‌లు, మౌజంలకు రంజాన్ తోఫా అందజేశారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. అల్లాహ్ ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు, దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు.
ఇదీ చదవండి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలపై ప్రభుత్వం ఆగ్రహం