Ramakrishna on GVL: ఎంపీ జీవీఎల్ నరసింహారావు కపట నాటకాలు కట్టిపెట్టాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. జీవీఎల్ రెండు నాల్కల ధోరణిని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించిన జీవీఎల్.. ఇప్పుడేమో చర్చకు కమిటీ కోరుతూ కేంద్ర హోంశాఖ లేఖ రాశానంటున్నారని ఆరోపించారు. భాజపా ధ్వంద వైఖరికి ఇవే నిదర్శనాలని విమర్శించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఈనెల 20న విజయవాడలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో సమావేశమవుతామని తెలిపారు.
ఇదీ చదవండి: PRC: పీఆర్సీపై నేటి నుంచి ఉపాధ్యాయుల సంతకాల సేకరణ