రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో(Rain alert in Andhra Pradesh) మరోసారి భారీ వర్షాలు కురిసే(heavy rains in) అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో(ap weather updates) నేటి నుంచి 30 వరకు.. రాయలసీమ, కోస్తాంధ్రలోని(rains in rayalaseema) చిత్తూరు, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో 13 సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే సూచనలు ఉందని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:
PEOPLE PROTEST FOR WATER: భూములిచ్చాం.. కనీసం నీళ్లివ్వండి..