ధర్మపరిరక్షణ యాత్రలో భాగంగా పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకరభారతి స్వామి విజయవాడ వచ్చారు. ఇంద్రకీలాద్రి చేరుకుని దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పండితులు వేదమంత్రోచ్ఛారణతో విద్యాశంకరభారతికి స్వాగతం పలికారు. దర్శన అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందించారు.
ఆలయంలో నిర్వహిస్తున్న చతుర్వేద హవనంలో స్వామి పాల్గొన్నారు. లోకకల్యాణార్ధం ఈ కార్యక్రమం... ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు... విద్యాశంకరభారతి స్వామి ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఇదీ చదవండి: