గ్రామీణ వైద్య విభాగంలో సేవలందిస్తున్న 104లోని వివిధ క్యాడర్ ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖలోని పీహెచ్సీ, హాస్పిటల్స్ తదితర విభాగాల్లోని ఖాళీలలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ 104 ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ఉద్యోగులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
104లో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్స్, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వాచ్మెన్ కేడర్ల ఉద్యోగులకు జీవో నెంబర్ 27 ప్రకారం వేతనాలు చెల్లించాలని.. 104 ఎన్ఎంయూ డ్రైవర్ల వేతనాలను రూ.26 వేలకు పెంచాలని...ఆప్కాస్ ద్వారా నియమించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.