ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అరెస్టు నిరసిస్తూ ఏ పీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లో భూవివాదం కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీని అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. భాజపా నిరంకుశ వైఖరికి ఇదే నిదర్శనమన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి నీరు, విద్యుత్ నిలిపివేయడం అప్రజాస్వామికమని చెప్పారు. ప్రజలు భాజపాకు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి... మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!