బిగ్బాస్ రియాలిటీ షో ప్రసారం నిలిపివేయాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో... తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రియాలిటీ షో ముసుగులో నడుస్తున్న బిగ్బాస్ కార్యక్రమ ప్రసారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటువంటి రియాలిటీ షోల ప్రసారాలను... రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేసుకోవాల్సిందిగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం గుర్తుచేశారు.
ఇదీ చదవండి