ETV Bharat / city

'మేం అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు' - Grmb meeting

హైదరాబాద్​ జలసౌధలో గెజిట్ నోటిఫికేషన్ అమలుపై భేటీ అయిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం (GRMB Meeting) ముగిసింది. జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ (GRMB Chairman Chandrasekhar Iyer)అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ఆమోదిస్తేనే తెలంగాణ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తాయని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టం చేశారు. గెజిట్​లోని సీడ్ మనీ వ్యయం విషయంలో స్పష్టత అడిగినట్లు తెలిపారు.

రజత్ కుమార్
రజత్ కుమార్
author img

By

Published : Oct 11, 2021, 5:12 PM IST

తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్

తాము అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తాయని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (Special Principal Secretary Department of Irrigation Rajathk kumar) అన్నారు. గెజిట్‌లో ఎక్కడా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునే విధానం లేదని ఆయన (Rajath Kumar Comments) స్పష్టం చేశారు. హైదరాబాద్​ జలసౌధలో గెజిట్ నోటిఫికేషన్ అమలుపై భేటీ అయిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం (GRMB Meeting) ముగిసింది.

జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ (GRMB Chairman Chandrasekhar Iyer) అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

సీడ్ మనీ విషయంలో..

జీఆర్ఎంబీ సమావేశంలో సీడ్ మనీ వ్యయం విషయంలో స్పష్టత అడిగినట్లు రజత్‌కుమార్ (Rajath Kumar Comments) పేర్కొన్నారు. పెద్దవాగు నుంచి గెజిట్ అమలు చేస్తామని చెప్పినట్లు ఆయన వివరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. బోర్డు కేవలం పర్యవేక్షణ మాత్రమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. వివరాలు చెబితేనే రాష్ట్రం నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు. పెద్దవాగు విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న రజత్‌కుమార్.. ప్రభుత్వం ఆమోదిస్తే బోర్డు పరిధిలోకి వెళ్తాయన్నారు.

"సీడ్ మనీ వ్యయం విషయంలో స్పష్టత అడిగాం. జీఆర్ఎంబీ ఛైర్మన్ పేపర్​పై రాసి ఇవ్వండి అన్నారు. అక్కడే రాసిఇచ్చాం. ఆంధ్రప్రదేశ్​ కూడా ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం చేయమని మేం చెప్పాం. కానీ ఏపీ మాత్రం గోదావరిలో ఒకేసారి అన్ని టేకోవర్ చేయాలని అడుగుతోంది. దీనిపై జీఆర్ఎంబీ, కేంద్ర జల్​శక్తి శాఖ నిర్ణయం తీసుకుంటుంది. గెజిట్‌లో ఎక్కడా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునే విధానం లేదు. మేం అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తాయి. పెద్దవాగు విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం." - రజత్ కుమార్, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి

ఇదీ చదవండి: Rajat Kumar: ఆ ఒక్కటే బోర్డు పరిధిలోకి.. మిగతా ప్రాజెక్టులు ఇప్పట్లో అసాధ్యం: తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.