ETV Bharat / city

పెండింగ్ వేతనాల కోసం ప్రైవేట్ ఉపాధ్యాయుల ధర్నా - విజయవాడలో ప్రైవేట్ ఉపాద్యాయుల ధర్నా

జీతాలు చెల్లించడం లేదంటూ.. ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు విజయవాడలో ధర్నాకు దిగారు. ఎంతో మంది సిబ్బంది.. ఉపాధి లేక కూలీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రుణ సదుపాయమైనా కల్పించాలని డిమాండ్ చేశారు.

private teachers protest
ధర్నా చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు
author img

By

Published : Oct 28, 2020, 3:43 PM IST

ఎనిమిది నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ.. విజయవాడలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, అధికారులు కల్పించుకుని తమకు న్యాయం చేయాలని నినదించారు. సక్రమంగా జీతాలు చెల్లించాలని ఎన్ని జీవోలు ఇచ్చినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు మూసివేయగా.. తమకు జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. కూలీ పనులు చేసుకుంటున్నారని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్నామన్నారు. ప్రభుత్వం స్పందించి.. కనీసం రుణ సదుపాయమైనా కల్పించాలని వేడుకున్నారు. తమ జీతాల్లో నుంచి తర్వాత రుణం మొత్తాన్ని జమచేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి:

రైతులకు సంకెళ్లు వేయడంపై ఎన్​హెచ్​ఆర్​సీకి వర్ల లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.