దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను నవంబర్ 1న సీఎం జగన్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొనిఈ పురస్కారాల(ysr-awards)ను ప్రధానం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు..29 వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. కేటగిరీల వారీగా 8 సంస్థలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11, కళలు, సంస్కృతి రంగాల్లో 20, సాహిత్యంలో 7, జర్నలిజంలో 6, వైద్యారోగ్య రంగంలో ఏడుగురిని అవార్డులకు ఎంపిక చేసినట్టు సమాచార శాఖ కమిషనర్ వెల్లడించింది.
వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షలు, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం కింది రూ. 5 లక్షల నగదుతోపాటు వైఎస్ఆర్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువా బహూకరిస్తారని వెల్లడించారు. గతంలోనే జరగాల్సిన ఈ కార్యక్రమం కొవిడ్ కారణంగా వాయిదాపడింది.
Spandana Video Conference: అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు: సీఎం జగన్