ETV Bharat / city

'సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది'

author img

By

Published : May 12, 2020, 5:40 PM IST

సొంత స్వార్థం కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెడితే ఒప్పుకునేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆంధ్రప్రదేశ్​ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆ అంశంపై అవరసమైతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు.

'సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది'
'సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది'

పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలున్నాయని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి, రాజకీయ, ఆర్థిక లావాదేవీల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

తెలంగాణకు నీళ్లు లేకుండా తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ సాధించుకున్నదే ప్రధానంగా నీళ్ల కోసమన్నారు. ప్రాజెక్టు అంశంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు విషయమై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : కృష్ణాజలాలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం అభ్యంతరకరం: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.