దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఈసారి దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చాయన్నారు. దసరా ఉత్సవాలు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని వివాదాలేనని ఆరోపించారు.
ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లలో.. గంటలకొద్దీ భక్తుల సహనాన్ని పరీక్షించారని ఆగ్రహం వ్యక్దం చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. దసరా శరన్నవరాత్రుల సమయంలో.. ప్రముఖ ఐఏఎస్ కుమార్తె అంతరాలయంలో ఏం పూజలు చేశారని ప్రశ్నించారు. దీనిపై సీఎం విచారణ చేపట్టి సీసీ ఫుటేజ్‌ను బయట పెట్టాలన్నారు.
ఇదీ చదవండి: