విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకమని సీపీ శ్రీనివాసులు తెలిపారు. నిందితుడు చెప్పే విషయాలనూ నమ్మలేమని వివరించారు. యువతిది హత్యేనన్న సీపీ... దివ్య శరీరంపై మొత్తం 13 గాయాలున్నట్లు గుర్తించామన్నారు. అయితే ఆ గాయాలు తాను చేసుకుందా? లేదా? అన్నది వైద్య నివేదికలో తేలుతుందని చెప్పారు. మృతురాలి గొంతు కింద తీవ్రమైన గాయమైందని... తనకు తానుగా ఆ తరహా గాయం చేసుకోవటం కష్టసాధ్యమని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి