రెడ్జోన్లో సరైన రక్షణ పరికరాలు లేకుండా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్నామని విజయవాడలో తపాలా శాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం రెడ్జోన్లో ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా తమతో పని చేయిస్తున్నారని రైల్వే మెయిల్ సర్వీస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న కార్యాలయాలు మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలున్నా.. అవేమి పట్టించుకోవటం లేదని అన్నారు. కార్యాలయం వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి ఏర్పాట్లు కూడా లేవని వాపోయారు. సిబ్బందిని కుదించి తమతో రెట్టింపు చాకిరి చేయిస్తున్నారన్నారు. అలాగే రెడ్జోన్లోకి వస్తుంటే తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 'మేము మనుషులం కాదా?... మా ప్రాణాలకు రక్షణ కల్పించరా?' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి..