Adulterated toddy case: విషం కలిపిన జీలుగు కల్లు తాగి ఐదుగురు ఆదివాసీలు మృతిచెందిన ఘటనపై తెదేపా నేతలు.. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ చినవీరభద్రుడికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ నెల 2న తూర్పుగోదావరి జిల్లాలో జీలుగు కళ్లు తాగి ఐదుగురు గిరిజనులు చనిపోయిన ఘటనకు సంబంధించి.. ఐదుగురు సభ్యులతో చంద్రబాబు నిజనిర్దారణ కమిటీని వేశారని చెప్పారు.
తాము విచారణ కోసం వెళ్తుంటే.. పోలీసులు అడ్డగించారని నేతలు మండిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు చెప్పామన్నారు. ఈ విషాదంపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మరణించిన గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు తెదేపా తరపున రూ.50 వేలు సాయం అందించామని నేతలు తెలిపారు.
సంబంధిత కథనాలు: