బాలాజీ హేచరీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. పశు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి అపార కృషి చేశారు. సుందర నాయుడు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఆయన ఒకరని కొనియాడారు.
రాష్ట్రంలో తొలితరం పారిశ్రామికవేత్తల్లో సుందరనాయుడు ఒకరు. సుందరనాయుడు వ్యక్తిగతంగా నాకు అత్యంత ఆత్మీయులు. కోళ్ల పరిశ్రమవైపు ఎంతోమందిని ప్రోత్సహించారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శనీయం. పనిపట్ల అంకితభావం ఆయన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్నతస్థాయికి చేరినా నిరాడంబరంగా జీవించారు. - వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
సుందరనాయుడు మృతి పౌల్ట్రీ రంగానికి తీరని లోటు. రైతు సమస్యలకు పరిష్కారంగా కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించారు. బాలాజీ హేచరీస్ స్థాపనతో పౌల్ట్రీ రంగంలో విప్లవాత్మక మార్పులు. పౌల్ట్రీరంగంలో వేల మందికి ఉపాధి కల్పించారు. సుందరనాయుడు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీచదవండి: ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత