విజయవాడలో సంచలనం సృష్టించిన వ్యాపారి రాహుల్ హత్యకేసులో నిందితుడు కొగంటి సత్యాన్ని పోలీసులు కస్టడీకి కోరారు. ఈ మేరకు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోగంటి సత్యం కస్టడీ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
బెంగళూరులో అదుపులోకి తీసుకుని..
రాహుల్ హత్య అనంతరం సత్యం బెంగళూరు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక కోరాడ విజయ్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు రాహుల్ హత్య విషయంలో కోగంటి సత్యం పాత్ర ఏంటన్న విషయంపై కూపీ లాగారు. నగరం విడిచి వెళ్లకుండా పిలిచినప్పుడు విచారణకు రావాలంటూ.... సత్యంకు ముందే సమాచారం ఇచ్చారు. అతడి కదలికలపై నిఘా పెట్టారు. అయినా సత్యం పోలీసుల కళ్లుగప్పి కె.ఎస్.నారాయణ అనే పేరుతో టికెట్ బుక్ చేసుకుని. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు విమానం ఎక్కి వెళ్లిపోయాడు. పోలీసులు సమాచారం తెలుసుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకునే సరికి విమానం టేకాఫ్ అయింది. వెంటనే బెంగళూరు విమానాశ్రయం పోలీసులకు సమాచారమివ్వగా వారు సత్యంను అక్కడే అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.
ఇదీ చదవండి: Vijayasaireddy: విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి