విజయవాడలో స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో రమేష్ కార్డియాక్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ రమేష్‌బాబును పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగింది. మొత్తం మూడురోజుల్లో దాదాపు 66 ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది.
అడిగిన ప్రశ్నలివే!
- కొవిడ్ కేర్ సెంటర్‌ను ఆసుపత్రి విస్తరణగా భావించవచ్చా?
- స్వర్ణప్యాలెస్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ చూశారా?
- హోటల్‌కు విద్యుత్తు సరఫరా చేసే విద్యుత్తు నియంత్రిక సామర్థ్యం ఎంత?
- మీరు ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందా?
- కొవిడ్ కేర్ సెంటర్‌లో చేరిన కరోనా బాధితుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తం ఎందుకు వసూలు చేశారు?
- ఎవరెవరు మీకు డబ్బులు కట్టారు?
రమేష్ బాబు ఏమన్నారంటే...
కేవలం కొవిడ్ కేర్ సెంటర్‌లో రోగులను పర్యవేక్షించేందుకు మాత్రమే ఉంచామని డా.రమేష్‌బాబు పోలీసులకు తెలిపారు. కొవిడ్ బాధితులకు చికిత్స అవసరమైతే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. పరిమితికి మించి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడలేదని... కేవలం ఆక్సిజన్ సిలిండర్లు మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. కరోనా రోగుల దగ్గర నుంచి ఇంతే వసూలు చేయాలని నిబంధనలు ఏమీ లేవని సమాధానం చెప్పినట్టు సమాచారం. స్వర్ణప్యాలెస్‌లో లోపాలున్నాయని తెలిసినా కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు మీరు అంగీకరించారా? అని పదేపదే అడగ్గా.. తాను కేవలం రోగులకు వైద్యం మాత్రమే చేశానని, మిగతా వ్యవహారాలు తన మేనేజర్ చూసుకున్నారని రమేష్ బాబు చెప్పినట్లు సమాచారం.
ఇదీ చదవండి