ఉద్యోగుల ఫిబ్రవరి 3న తలపెట్టిన 'చలో విజయవాడ'కు పోలీసుల అనుమతి నిరాకరించారు. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా స్పష్టం చేశారు. కొవిడ్ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉందని అన్నారు. 5 వేల మంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారని..,అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందని సీపీ అన్నారు. దయచేసి చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావద్దొని విజ్ఞప్తి చేశారు.
"చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు. కొవిడ్ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదు. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉంది. 5 వేల మంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారు. అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుంది. దయచేసి చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావద్దు." -కాంతిరాణా, విజయవాడ సీపీ
తగ్గేదెలే..
ఇదిలా ఉండగా.. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. 'చలో విజయవాడ'ను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మంత్రులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు..చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారన్నారు. ఉద్యోగులను భయపెట్టవద్దని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలని హితవు పలికారు. సమ్మె, ఆందోళన తాత్కాలికమనీ, మళ్లీ అందరూ కలిసే పని చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఇదీ చదవండి
AP Employees Strike: సమస్యకు సమ్మె పరిష్కారం కాదు: సీఎస్ సమీర్‌శర్మ