ETV Bharat / city

హైదరాబాద్ పోలీసులకు చిక్కిన సెల్​ఫోన్​ దొంగల ముఠా - cp sajjanar latest news

మూసి ఉన్న దుకాణాల షట్టర్లు ధ్వంసం చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. సెల్​ఫోన్లు అమ్మే దుకాణాల్లో చోరీలకు పాల్పడి.. వాటిని ఓఎల్​ఎక్స్​లో అమ్ముతున్నట్లు గుర్తించారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో వీరిపై కేసులు నమోదైనట్లు సైబరాబాద్​ సీపీ వెల్లడించారు.

police-arrested-the-cell-phone-thieves
పోలీసులకు చిక్కిన సెల్​ఫోన్​ దొంగల ముఠా
author img

By

Published : Dec 9, 2020, 8:03 AM IST

తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్​ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 13న హైదరాబాద్​ మియాపూర్​లోని రిలయన్స్ డిజిటల్ మాల్​లో దొంగతనం జరిగింది. షాపులోని 30 లక్షల విలువైన 119 సెల్​ఫోన్లు చోరీకి గురయ్యాయని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఐదుగురు వ్యక్తులు దుకాణం షట్టర్లు పగులగొట్టి సెల్​ఫోన్లు దొంగతనం చేసినట్లు గుర్తించారు. మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్​లలో గాలించారు. ముంబయి పోలీసుల సహకారంతో ఓ ఇంట్లో ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్​ తర్వాత పటాన్​చెరులోని ఓ మద్యం షాపులోనూ దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితుడు మహ్మద్ తారీఫ్ దావుద్​తోపాటు మరో నలుగురు ఫరాన్, రషీద్, మహ్మద్ సుఫియన్, రాజులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 30 లక్షల విలువైన 113 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఓ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన తారీఫ్​కు అక్కడే.. రాజు అనే మరో నేరస్థుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ జైలు నుంచి విడుదల అయ్యాక మరో ముగ్గురితో కలిసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా దుకాణదారులు వాచ్​మెన్​ను నియమించుకోవడంతోపాటు.. తమ షాపుల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు.

ఇదీ చదవండి:

ఇంట్లోంచి యువతి అదృశ్యం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.