రాష్ట్రంలో సంచలనం రేపిన దుర్గగుడి రథం సింహం ప్రతిమల అదృశ్యంపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొండపై ఉన్న శివాలయంలో గత కొన్ని నెలలుగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. బిహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలు విస్తరణ పనుల్లో పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా కొంతమంది ఇంటికి వెళ్లిపోయారు.
విజయవాడ పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి శివాలయ విస్తరణ పనుల్లో పాల్గొన్న కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పనులు కాంట్రాక్ట్ తీసుకున్న మేస్త్రీలను, కూలీలను విజయవాడలో విచారిస్తున్నారు. వీరితోపాటు ఆలయ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. మరోవైపు ఆలయాల్లో దొంగతనాలు చేసే ముఠాలపై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి :