జీవీఎంసీ పరిధిలో వాలంటీర్లు అధికారిక ఫోన్లు దుర్వినియోగం చేస్తున్నారని.. పుర ఎన్నికలు ముగిసే వరకు వాటిని సీజ్ చేయాలని కోరుతూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లేయాలని వాలంటీర్లు ప్రలోభపెడుతున్నారని తెలిపారు. ప్రజా సేవకులైన వాలంటీర్లు తటస్థంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించడం చట్ట విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం వివరాలు సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య..మృతదేహంతో విద్యార్థుల ధర్నా