తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్ధపూర్కు చెందిన యువకుడు... ఎడ్లపల్లిలోని బాలికకు ఇన్స్టాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు. ఫ్రెండ్షిప్ అంటూ చనువుగా మాట్లాడి.. ఆమె ఫొటోలు తీశాడు. తర్వాత వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. వేధింపులు తట్టుకోలేని బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విచారణ జరిపిన ఎడ్లపల్లి పోలీసులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నారు. నిన్న అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. రాత్రి కావడంతో పోలీస్ కస్టడీలో ఉంచారు. తెల్లవారుజామును పోలీసుల కళ్లుగప్పి ఆ వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడు. నిందితున్ని పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వారితో చనువు పెంచుకునే ముందు ఎలాంటి వారో తెలుసుకుని మసులుకోవాలంటున్నారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి తెదేపా నేతలు